E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మార్చి 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, MBA ఉత్తీర్ణులైన 35 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.