WGL: చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పఠన అలవాటు పెంపొందించేందుకు గ్రంథాలయాలు ఉపయోగకరమని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తకాలను చదివి జ్ఞానాన్ని విస్తరించుకోవాలని సూచించారు. అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.