BDK: భద్రాచలంలో శుక్రవారం జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర DGP శివధర్ రెడ్డికి SP రోహిత్ రాజు గురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల నుంచి DGP గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రామయ్య కళ్యాణ వేడుకల భద్రతా ఏర్పాట్లపై SPతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.