MDK: విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు తూప్రాన్ విద్యుత్ డివిజన్ కార్యాలయం ముందు ఆర్టిజన్ కార్మికులు ఆందోళన చేపట్టారు. డివిజన్ అధ్యక్షులు రాజు రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు తిరుపతి, స్వామి, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.