GDWL: గర్భిణీల ఆరోగ్య పరిస్థితులపై పీహెచ్సీ వైద్యులు దృష్టి కేంద్రీకరించి పర్యవేక్షణ చేయాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. గురువారం ఇటిక్యాల మండల కేంద్రంలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, గర్భిణీల సంరక్షణ, టీకాలు, ఔషధ నిల్వలు, రికార్డులు పరిశీలించారు. ఐరన్ మాత్రలు సమయానికి ఇవ్వాలన్నారు.