MHBD: సమస్యలు పరిష్కరించకపోతే ఏప్రిల్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రకటించింది. తొర్రూరు పట్టణంలో గురువారం జరిగిన నిరసనలో జేఏసీ నేత సికిందర్ ఈ విషయాన్ని తెలిపారు. ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్ వర్కర్లు, స్పాట్ బిల్లర్లు, ఎస్పీఎం వర్కర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే సమ్మె తప్పదన్నారు.