AP: NTR వైద్య సేవా ట్రస్ట్ CEOకు స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఏప్రిల్ 1నుంచి ఏపీలో NTR వైద్య సేవా ట్రస్టు కింద అందిస్తున్న సేవలు నిలిపివేయాని నిర్ణయించినట్లు లేఖలో పేర్కొన్నాయి. రూ.3 వేల కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాని వెల్లడించాయి. ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాయి.