AP: భక్తలు ఫిర్యాదులపై విజయవాడ దుర్గగుడి ఈవో శీనా నాయక్ చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి శివాలయంలో విధుల్లో అర్చకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉపప్రధాన అర్చకుడితో పాటు సిబ్బందిని సస్పెండ్ చేశారు. అలాగే టెండరు నిబంధనలు ఉల్లంఘించిన కొబ్బరి చిప్పల కాంట్రాక్టర్కు జరిమానా విధించారు. వారం రోజుల్లో జరిమానా చెల్లించకపోతే టెండరు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.