MBNR: మహబూబ్నగర్ 11వ డివిజన్ రాజీవ్ గృహకల్పలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి గురువారం ఇంటింటికీ తడి, పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా ఛైర్మన్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పట్టణ పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసి సహకరించాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.