ADB: తలమడుగు మండలంలోని పల్సి-బి తండాకు చెందిన గిరిజన రైతుల 13 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించిందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టాలు అందుకున్న రైతులు శనివారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA పాయల్ శంకర్, గణేష్ రెడ్డి, అధికారులు, తదితరులున్నారు.