PDPL: GDK జనరల్ ఆసుపత్రిలో కంటి శస్త్ర చికిత్సలు ప్రారంభమైనట్లు కలెక్టర్ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఆప్తమాలజిస్టు డాక్టర్ గోపికృష్ణ ఆధ్వర్యంలో మొదటి కాట్రేట్ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు ఆయన పేర్కొన్నారు. కావున ఇకనుంచి జిల్లా ప్రజలు కంటి శస్త్ర చికిత్సలకు గోదావరిఖని ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అన్ని రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు.