MNCL: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన బోధన అందుతుందని మార్కెట్ కమిటీ వైస్‌ఛైర్మన్ నర్సింగరావు పేర్కొన్నారు. కన్నెపల్లి మండలం జనకాపూర్‌లో ఇవాళ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఇంగ్లీష్ మీడియం బోధనను సద్వినియోగం చేసుకోవాలన్నారు.