JGTL: గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మైనర్‌గా వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి వాహనాలను సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.