ADB: కులమతాలకు అతీతంగా ప్రతి పండుగలను సోదర భావంతో జరుపుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’ విందు కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడం ఒక మంచి పరిణామమని పేర్కొన్నారు.