ASF: అర్హులందరికీ పథకాలు అందించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఇవాళ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో 132 మంది లబ్ధిదారులకు, రెబ్బెన మండలం తహసీల్దార్ కార్యాలయంలో 99 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెక్కులను అందజేశారు.