కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలోని చిన్న ఆవుటపల్లి గ్రామంలో “జలధార – జల హారతి” కార్యక్రమం శనివారం నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. స్వయంగా నీటి గుంతలు తవ్వి సందేశం ఇచ్చారు. ప్రతి వర్షపు బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.