ADB: ఉపాధి హామీ పనికి వచ్చే కూలీలు ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా రెండుసార్లు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైజేషన్) హాజరు తప్పనిసరని ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు. బోథ్ మండలం బాబేరలో జరుగుతున్న పనులను శనివారం పరిశీలించారు. ఉదయం 6 గంటలకు ఒకసారి 10 గంటలకు రెండవసారి హాజరు వేసుకోవాలని సూచించారు. పనులను కొలతల ప్రకారం చేయాలన్నారు.