W.G: అతివేగంగా వాహనాలు నడపడాన్ని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తిపై దాడి చేసిన నలుగురిపై పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. వెంప గ్రామానికి చెందిన బల్లా రవికుమార్ ఈనెల 5న స్థానిక ఏటీఎం వద్ద ఉండగా, వకపల్లి సైమన్, బడుగు లాజర్, గెడ్డం రిషి కుమార్, మంద ప్రవీణ్ ద్విచక్రవాహనాలపై అతివేగంగా వచ్చారు. దీనిని రవికుమార్ నిలదీయగా, వారు ఆయనపై దాడికి దిగారని పోలీసులు తెలిపారు.