NGKL: ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లిలో సర్పంచ్ వినీత ధర్మేందర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కృష్ణదేవ, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.