HYD: ఇంటర్ ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. వారాసిగూడకు చెందిన కొయ్యాడ కళ్యాణి బేగం (18) మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై, ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.