NGKL: వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా ఈతకు పంపరాదని ఎస్సై కే.గోవర్ధన్ సూచించారు. తెలియకుండా చెరువులు, కాల్వల వద్దకు వెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే పంపాలని ఆయన స్పష్టం చేశారు.