GDWL: క్రీడలతో స్నేహ సోదర భావాలు పెంపొందుతాయని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి షెక్షావలి ఆచారి, విండో ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శనివారం అయిజలో సీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఏటా అంబేడ్కర్ జయంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.