JGL: రాయికల్ పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైతాపూర్ గ్రామంలో ఉన్న సమస్యలపై సర్పంచ్ తలారి నాగమణి అధికారులకు వివరించారు. సమావేశం అనంతరం బోర్ మోటార్, హైమాస్ లైట్ మంజూరు చేయాలని కోరుతూ జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, ఎంపీడీవో చిరంజీవికి సర్పంచ్ పాలకవర్గం సభ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు.