KMR: పిట్లం మండల ఎస్ఐగా ఆంజనేయులు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో గాంధారిలో విధులు నిర్వహించిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ వెంకట్రావు బాన్సువాడకు బదిలీ అయ్యారు. నూతన ఎస్ఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.