IPLలో భాగంగా రేపు KKR, LSG మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఇదే స్టేడియం వేదికగా KKR vs PBKS మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఈ మ్యాచ్ అయినా జరుగుతుందా? లేక వర్షం కారణంగా రద్దవుతుందా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, రేపటి మ్యాచ్కు వర్షం ముప్పు అంతగా ఉండకపోవచ్చని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.