గద్వాల మున్సిపాలిటీపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అస్తవ్యస్త పార్కింగ్‌ను నివారించాలని, పన్నులు సకాలంలో వసూలు చేయాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.