ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. బుధవారం ఏకంగా 50 వేల బస్తాల తేజ మిర్చి అమ్మకానికి రావడం ఈ సీజన్లో ఇది మూడోసారి. జెండాపాట ధర క్వింటాలుకు రూ. 21,000 పలకగా, నాణ్యతను బట్టి రూ.19,000 నుంచి రూ. 20,000 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. పత్తి గరిష్ఠ ధర క్వింటాలుకు రూ. 8,300గా నమోదయిందని అధికారులు తెలిపారు.