VKB: మర్పల్లి మండలంలోని గ్రామాల అభివృద్ధిపై చర్చించేందుకు గురువారం ఉదయం 10 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక 99 రోజుల’ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సర్పంచులు, యువజన సంఘాల నాయకులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.