KMM: మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని శివాలయం రోడ్డులో కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు.