NLG: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా ఇవాళ సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నివాళులర్పించారు. భూమి, వెట్టిచాకిరి విముక్తి కోసం 16 ఏళ్లకే తుపాకీ పట్టిన ఆమె, రజాకార్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్యేగా సమస్యలపై అసెంబ్లీని గడగడలాడించారని, సారా వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా పనిచేశారన్నారు.