MDK: చిలిపిచేడ్ మండలం జగ్గంపేటలో యువతి (23) అనారోగ్యంతో మృతి చెందింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మరణించింది. చిన్న వయసులోనే హర్షిత మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. కూతురి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.