SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు గ్రామస్తులు భారీగా విరాళాలు అందజేశారు. సర్పంచ్ ఎర్రల జానకి, ఉపసర్పంచ్ పద్మలకు విరాళాల చెక్కులు అందజేశారు. శ్రీలత రెడ్డి-మోహన్ రెడ్డి దంపతులు రూ.1 లక్ష, ముదిరాజ్, గౌడ సంఘాలు తలో రూ.50 వేలు, రజక సంఘం రూ.15 వేలు విరాళంగా ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని దాతలను అభినందించారు.