HYD: ORR పరిధిలో 22 వేల ఇళ్లకు వెంటనే విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులు కిందిస్థాయి యంత్రాంగానికి ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనతో నివాసాలకు వేగంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉంది.