BHNG: అదానీ లాజిస్టిక్స్ లిమిటెడ్ పేరుతో అనుమతులు లేకుండా అంబుజా సిమెంట్ పరిశ్రమ పనులు చేస్తే మరో మహా ప్రజా పోరాటం తప్పదని పర్యావరణ పరిరక్షణ వేదిక కన్వీనర్ జల్లెల పెంటయ్య, కో-కన్వీనర్ ఎండీ రెహాన్ హెచ్చరించారు. రామన్నపేట అంబుజా సిమెంట్ ప్రతిపాదిత స్థలంలో బుధవారం పర్యావరణ పరిరక్షణ వేదిక, అఖిలపక్షాల ఆధ్వర్యంలో స్థానిక నాయకులు పనులు అడ్డుకున్నారు.