NZB: జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో 1,490 కిలో మీటర్ల పొడవైన రహదారులు ఉన్నాయి. వీటిపై ప్రమాదాలు ఏటేటా పెరుగుతున్నాయి. దీనికి నిర్మాణ, నిర్వహణ లోపాలే కారణమని కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా రహదారి భద్రత కమిటీ ఇటీవల గుర్తించింది. జిల్లాలోని ఆర్అండ్ బీ రహదారులను నిర్మించిన తర్వాత నిర్వహణ లోపం కనిపిస్తోంది.