MNCL: చెన్నూర్ పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనులు వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.