VKB: దుద్యాల్ మండలంలో పారిశ్రామికవాడ కోసం భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. 2025 DEC 20వ తేదీన మండల కేంద్రంలోని 363 సర్వే నంబర్లోని 85 మంది రైతులకు సంబంధించిన 144 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భూమి కలిగిన 85 మంది రైతులతో ఆర్డీవో సమక్షంలో ఇవాళ ఉదయం 10:30 గంటలకు గ్రామసభ నిర్వహించనున్నట్లు MRO కిషన్ తెలిపారు.