MDK: మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, పరిశుభ్రతను పరిశీలించిన ఆయన, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం వాహనాల తనిఖీలు చేపట్టాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు.