KMM: చింతకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా మంగళవారం ఎస్సై వీరేందర్ ఆధ్వర్యంలో హాట్స్పాట్ల వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. పందిళ్లపల్లి, రామక్రిష్ణపురం ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు ఈ చర్యలు చేపట్టారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నట్లు ఎస్సై తెలిపారు.