NLG: నాగార్జునసాగర్, హిల్ కాలనీలో హైదరాబాద్ ప్రధాన రహదారిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. లోక్ సభలో రాష్ట్ర ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోలుస్తూ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు.