SRD: పటాన్ చెరు పోలీస్స్టేషన్ పరిధిలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీకి చెందిన నాగేశ్ మద్యం తాగి ఇంటికి రావడంపై భార్య మందలించడంతో ఈ నెల 6న ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. బంధువులు, పరిచయస్తుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భార్య సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.