NLG: ఆసియాలోనే రెండో అతిపెద్ద రైస్ మిల్లు హబ్‌గా పేరున్న మిర్యాలగూడలో ధాన్యం ధరలు భారీగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం క్వింటాకు రూ. 2,750 పలికిన ధర, మిల్లర్లు సిండికేట్‌గా మారి రూ. 2,250కు తగ్గించారని రైతులు వాపోతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.