వికారాబాద్ జిల్లాలో నూనె పంటల సాగులో రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ గురువారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మరియాపూర్ గ్రామంలో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. వికారాబాద్లో 2,26,000 ఎకరాల్లో కుసుమ నూనె పంటలు సాగుతున్నాయని కలెక్టర్ అన్నారు.