WNP: బాబు జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకలను వనపర్తి IDOC కార్యాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి, ఇన్చార్జ్ మంత్రులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కుల సంఘాల నాయకులు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.