SRCL: వీర్నపల్లి మండలం బంజేరు గ్రామంలో గుగులోతు హంసి అనే వృద్దురాలీ మెడలో నుంచి దుండగులు బంగారు గొలుసు చోరీ చేశారు. ఇవాళ ఉదయం 5 గంటలకు బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు వాకిలి ఉడుస్తుండగా నోరు మూసి కళ్ళలో కారం పొడి చల్లి మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎస్సై వేముల లక్ష్మన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.