వరంగల్ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈనెల 23 నుంచి క్రయవిక్రయాల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 7:05 గంటలకు మిర్చి విక్రయాలు, 8:05కు పత్తి, 8:15కు పల్లికాయ, 8:30కు పసుపు, 8:45 గంటలకు ధాన్యం, అపరాల బీటు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రైతులు విషయాన్ని గమనించాలని సూచించారు.