MHBD: మహబూబాబాద్‌లో ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, మున్సిపల్ ఛైర్మన్ జ్యోతి రమేష్ రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వేసవికాలంలో మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు త్రాగునీటి విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నీటి ఎద్దడి లేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.