MDK: ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానం హుండీలు లెక్కించగా రూ.52.12 లక్షలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మఠం వీరేశం, ఎండోమెంట్ మెదక్ జిల్లా ఇన్ స్పెక్టర్ రంగారావు తెలిపారు. మెదక్ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 56 రోజుల హుండీ లెక్కించారు. మిశ్రమ బంగారం 0.024 గ్రాములు, మిశ్రమ వెండి 000.927 గ్రాములు వచ్చినట్లు వెల్లడించారు.