NGKL: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) అచ్చంపేట డివిజన్ అధ్యక్షుడిగా కొమ్ము రేనయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ గౌస్, కోశాధికారిగా రామకృష్ణతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.