వనపర్తి పట్టణంలో అర్ధరాత్రి వేళల్లో ఇళ్ల బయట పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాల పైపులు కోసి పెట్రోల్‌ను దొంగిలిస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు. పోలీస్ పాట్రోలింగ్ లేని ప్రదేశాలలో రోజూ పెట్రోల్ దొంగలు బరితెగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దృష్టి సారించి ప్రతి కాలనీలో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.